

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తదుపరి చిత్రం AK64 అధికారిక ప్రకటనకు ముందే కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అభిమానులు సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తుండగా, ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఆయన పారితోషికం గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. రెమ్యునరేషన్ అంశమే సినిమా ప్రకటన ఆలస్యానికి కారణమై ఉండొచ్చని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అజిత్ ఈసారి తన పారితోషికాన్ని తగ్గించుకునేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో రూ.170 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారని ప్రచారం ఉండగా, AK64 కోసం సుమారు రూ.150 కోట్లకు ఒప్పుకునే అవకాశం ఉందని టాక్. మరోవైపు కొందరు నిర్మాతలు రూ.90 కోట్ల నుంచి రూ.110 కోట్ల మధ్య ఆఫర్లు ఇచ్చినట్లు కూడా కథనాలు వస్తున్నాయి. ఈ సంఖ్యలకు అధికారిక ధృవీకరణ లేకపోయినా, సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. ఇదే సమయంలో అధిక్ రవిచంద్రన్, శిరుతై శివ దర్శకత్వాల్లో ప్రాజెక్టులు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!