

సూపర్ స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘వారణాసి’తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో తన మార్కెట్‌ను మరింత విస్తరించుకోవాలని మహేష్ భావిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు అభిమానుల దృష్టి ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పైనే నిలిచింది. ఈ క్రమంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు బలంగా వినిపిస్తోంది.
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సందీప్ రెడ్డి వంగా, మహేష్‌బాబుతో కలిసి ఓ భారీ యాక్షన్ కథను తెరకెక్కించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, సామాజిక మాధ్యమాల్లో మాత్రం వార్తలు వైరల్‌గా మారాయి. మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్, వంగా శైలి భావోద్వేగాలు కలిస్తే కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!