

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, మరో 25 నుంచి 30 రోజుల్లో చిత్రీకరణ పూర్తయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసి అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ఈ చిత్రంలోని ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రిలీజ్ డేట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండటంతో వెంకటేష్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తి చూపిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!