

తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం పెద్ద చర్చగా మారింది. దాదాపు 27 సంవత్సరాలుగా కలిసి ఉన్న విజయ్ మరియు ఆయన భార్య సంగీత విడాకులు తీసుకునే దిశగా వెళ్లుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సంగీత కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ఈ వార్త అభిమానులను తీవ్రంగా కలవరపెడుతుండగా, సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
ఇక కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ వివాదాన్ని కోర్టు బయటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. భార్య సంగీత, పిల్లలు జేసన్ సంజయ్ మరియు దివ్య సాషా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సుమారు రూ.250 కోట్ల సెటిల్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దిశగా తన పార్టీ టీవీకేను బలోపేతం చేయడంపై విజయ్ దృష్టి పెట్టారు. ఆయన చివరి సినిమా ‘జన నాయకుడు’ విడుదలపై ఇంకా స్పష్టత లేకపోయినా, సెన్సార్ మరియు ఇతర సమస్యలు పరిష్కారమైతే ఈ సమ్మర్లో విడుదల చేసే యోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.





.png&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!