4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీకి అండగా నిలవాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ

Writer: Pooja 11:29 PM, 3 నవంబర్, 2026
ఏపీకి అండగా నిలవాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ

అర్నబ్, మురసు తుఫాన్ల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంటలు, ఆస్తులు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టంతో పాటు ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను వివరిస్తూ అమిత్ షాకు లేఖ రాశారు. రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని తక్షణమే అందించాలని విజ్ఞప్తి చేశారు. మురసు తుఫాను ప్రభావంపై అమిత్ షా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఒకే రోజు రెండుసార్లు కేంద్ర హోంమంత్రితో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. అర్నబ్ తుఫాను ప్రభావం నుంచి రాష్ట్రం పూర్తిగా కోలుకోకముందే మురసు తుఫాను పరిస్థితులను మరింత క్లిష్టంగా మార్చిందని తెలిపారు.

మురసు తుఫాను కారణంగా రాష్ట్రంలోని ఎనిమిది శాఖలకు సంబంధించి ప్రాథమికంగా రూ.343.95 కోట్ల నష్టం వాటిల్లినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇందులో దాదాపు 94 శాతం నష్టం వ్యవసాయ రంగంలోనే ఉందని తెలిపారు. ఏడు జిల్లాల్లోని 465 గ్రామాల పరిధిలో 50,473 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా, 69,828 మంది రైతులు ప్రభావితమయ్యారని వివరించారు. సుమారు 45,900 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లిందని, వ్యవసాయ రంగానికి ప్రాథమికంగా రూ.324.22 కోట్ల నష్టం అంచనా వేసినట్లు పేర్కొన్నారు. బాపట్ల, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పంట నష్టం అధికంగా ఉందని, ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు. తుఫాను ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ, అత్యవసర కార్యకలాపాల కేంద్రాలను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. సహాయక చర్యల కోసం 11 ఎస్‌డీఆర్ఎఫ్, 13 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేయడంతో పాటు ప్రభావిత జిల్లాల్లో 480 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 12,230 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

తుఫాను నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందాన్ని పంపినందుకు అమిత్ షాకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థ, సాగునీటి వనరులకు జరిగిన నష్టంపై సమగ్ర అంచనాలు రూపొందిస్తామని వెల్లడించారు. పూర్తి స్థాయి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. వరుస తుఫాన్ల కారణంగా రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం పడిందని, ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు కేంద్రం సహకరించాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎల్‌నినో ప్రభావంతో రోగాల ముప్పు - డీహెచ్ రవీందర్ నాయక్

ఎల్‌నినో ప్రభావంతో రోగాల ముప్పు - డీహెచ్ రవీందర్ నాయక్

సినిమా అభిమానులకు తమిళనాడు సర్కార్ గుడ్ న్యూస్

సినిమా అభిమానులకు తమిళనాడు సర్కార్ గుడ్ న్యూస్

ఫారం-6 దరఖాస్తులపై ఈసీ కీలక స్పష్టత

ఫారం-6 దరఖాస్తులపై ఈసీ కీలక స్పష్టత

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో మరోసారి ఊరట

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో మరోసారి ఊరట

అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ మరో కీలక చర్య
ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఅమిత్ షాఆంధ్రప్రదేశ్ తుఫాను నష్టంతుఫాను సహాయక చర్యలురైతులకు పంట నష్టంకేంద్ర ప్రభుత్వ సాయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ మరో కీలక చర్య

ఇజ్రాయెల్‌కు అమెరికా సైనిక సాయం బంద్

ఇజ్రాయెల్‌కు అమెరికా సైనిక సాయం బంద్

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎల్‌నినో ప్రభావంతో రోగాల ముప్పు - డీహెచ్ రవీందర్ నాయక్
జనరల్

ఎల్‌నినో ప్రభావంతో రోగాల ముప్పు - డీహెచ్ రవీందర్ నాయక్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 58: బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల మంటలు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 58: బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల మంటలు

ఏపీకి అండగా నిలవాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ
జనరల్

ఏపీకి అండగా నిలవాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ

సినిమా అభిమానులకు తమిళనాడు సర్కార్ గుడ్ న్యూస్
జనరల్

సినిమా అభిమానులకు తమిళనాడు సర్కార్ గుడ్ న్యూస్

ఫారం-6 దరఖాస్తులపై ఈసీ కీలక స్పష్టత
జనరల్

ఫారం-6 దరఖాస్తులపై ఈసీ కీలక స్పష్టత

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో మరోసారి ఊరట
జనరల్

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో మరోసారి ఊరట

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై జగన్ సంచలన ట్వీట్
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై జగన్ సంచలన ట్వీట్

అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ మరో కీలక చర్య
జనరల్

అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ మరో కీలక చర్య

ఇజ్రాయెల్‌కు అమెరికా సైనిక సాయం బంద్
జనరల్

ఇజ్రాయెల్‌కు అమెరికా సైనిక సాయం బంద్

ఫహాద్‌తో తన బంధంపై సరదాగా స్పందించిన నజ్రియా
సినిమాలు

ఫహాద్‌తో తన బంధంపై సరదాగా స్పందించిన నజ్రియా

డాలర్‌తో పోలిస్తే బలపడిన రూపాయి
బిజినెస్

డాలర్‌తో పోలిస్తే బలపడిన రూపాయి

మరోసారి నవ్వులు పంచేందుకు సిద్ధమైన 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' గ్యాంగ్
సినిమాలు

మరోసారి నవ్వులు పంచేందుకు సిద్ధమైన 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' గ్యాంగ్