

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్‌కు అందిస్తున్న ఏటా సుమారు 4 బిలియన్ డాలర్ల ఆర్థిక, సైనిక సాయాన్ని 2026 చివరి నాటికి నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ, ఈ సాయాన్ని నిలిపివేసేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో అవగాహనకు వచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇజ్రాయెల్ ప్రస్తుతం విజయవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన దేశంగా ఎదిగిందని, ఇకపై అమెరికా నుంచి ఈ ఆర్థిక సాయం అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే, అమెరికా తయారీ ఆయుధాలు, సైనిక పరికరాలను కొనుగోలు చేసేందుకు ఇజ్రాయెల్‌కు ఎలాంటి అడ్డంకులు ఉండవని స్పష్టం చేశారు.
అయితే, ఈ నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న అమెరికా-ఇజ్రాయెల్ భద్రతా ఒప్పందం ప్రకారం, ఇజ్రాయెల్‌కు ఏటా సుమారు 3.8 బిలియన్ డాలర్ల సైనిక సాయం అందుతోంది. ఈ ఒప్పందం 2028 వరకు కొనసాగాల్సి ఉంది. ట్రంప్ ప్రకటన ప్రస్తుత ఒప్పందంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంపై నెతన్యాహు కార్యాలయం వెంటనే స్పందించలేదు. అవసరమైతే ఇజ్రాయెల్‌కు అమెరికా సహాయం కొనసాగిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!