
జనరల్

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు విధించిన మధ్యంతర స్టేను పొడిగించింది. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు స్టే ఉత్తర్వులను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. కోర్టు ఆదేశాలను ధిక్కరించారనే ఆరోపణల నేపథ్యంలో రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రంగనాథ్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో గతంలోనే హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై స్టే విధించింది. తాజాగా ఆ స్టేను వచ్చే ఏడాది జనవరి 20 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రంగనాథ్ తొలగింపునకు సంబంధించిన సింగిల్ బెంచ్ ఆదేశాలు అప్పటివరకు అమలులో ఉండవు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కోర్టులో కొనసాగనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!