

సినీ అభిమానులకు శుభవార్త. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం సినిమా థియేటర్లలో ఉదయం 6 గంటల షోలను తిరిగి ప్రారంభించడంతో పాటు, రోజుకు ప్రదర్శించే ఆటల సంఖ్యను పెంచుకునేందుకు అనుమతిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 3, 2026న జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం, సినిమా విడుదలైన మొదటి వారంలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చు. ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2.30 గంటల వరకు సినిమాలను ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో కొత్త సినిమాల విడుదల సందర్భంగా థియేటర్లకు వెళ్లాలనుకునే అభిమానులకు మరింత వెసులుబాటు కలగనుంది.
వారాంతాలు, జాతీయ మరియు రాష్ట్ర సెలవు రోజుల్లో రోజుకు ఆరు షోలు ప్రదర్శించుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకు తమిళనాడులోని థియేటర్లు ఉదయం 9 గంటల నుంచి రోజుకు నాలుగు ఆటలు మాత్రమే ప్రదర్శించేందుకు అనుమతి ఉండేది. తాజా నిర్ణయంతో నవంబర్ 6న విడుదల కానున్న సూర్య సీన్, నయనతార మూకుతి అమ్మన్ 2 సినిమాలకు ప్రయోజనం కలగవచ్చని భావిస్తున్నారు. గతంలో అజిత్ నటించిన తునివు సినిమా వేడుకల సందర్భంగా రోహిణీ సిల్వర్ స్క్రీన్స్ వద్ద ఓ అభిమాని మృతి చెందడంతో అప్పటి డీఎంకే ప్రభుత్వం మార్నింగ్ షోలపై ఆంక్షలు విధించింది. తాజాగా విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ షోలు మళ్లీ అందుబాటులోకి రానున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!