

తెలుగు, తమిళ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సునైనా ప్రస్తుతం వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో హాట్ టాపిక్‌గా మారింది. దుబాయ్‌కు చెందిన ప్రముఖ ఇన్ఫ్లూయెన్సర్, కంటెంట్ క్రియేటర్ ఖలీద్ అల్ అమేరీతో ఆమె బంధంపై సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరూ సోషల్ మీడియా ఖాతాల్లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, కలిసి ఉన్న కొన్ని ఫోటోలను తొలగించడం వంటి చర్యలు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి.
గతంలో ఖలీద్‌తో నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు రావడంతో త్వరలో పెళ్లి జరుగుతుందని అభిమానులు భావించారు. అయితే తాజాగా వెలుగులోకి వస్తున్న రూమర్స్ ప్రకారం వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడి పెళ్లి ప్రణాళికలు నిలిచిపోయాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు సునైనా లేదా ఖలీద్ అధికారికంగా స్పందించలేదు. దీంతో అభిమానులు వారి స్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!