

హీరో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్నారు. గోపీచంద్ కెరీర్ లోనే భారీ సినిమా అనుకోవచ్చు. ఏడో శతాబ్ధం బ్యాక్ డ్రాప్ లో, ఓ వీరుడి కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి దర్శకుడు సంకల్ప్ రెడ్డి. గతంలో ఘాజీ, అంతరిక్షం సినిమాలు అందించిన దర్శకుడు. శతాబ్దాల కాలం కిందటి యోథుడిగా ఒక పీరియాడిక్ గెటప్ లో గోపీచంద్ కనిపించబోతున్నారు. దీని కోసం హైదరాబాద్ సిటీ శివార్లలో కొన్ని ఎకరాల స్థలంలో భారీ సెట్ ను నిర్మించారు. ఈ సెట్ కోసం దాదాపు ఆరేడు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. నిర్మాత చిట్టూరి శ్రీను ఈ సినిమాను భారీ వ్యయం భరించి నిర్మిస్తున్నారు.
ఈ పీరియాడిక్ సినిమా ఎమోషన్, యాక్షన్, లవ్ అన్నీ సమపాళ్లలో వుండే కథతో తయారవుతోంది. కథను నమ్మి, గోపీచంద్ మార్కెట్ ను మించి ఖర్చు చేస్తున్నారు. సాహసం సినిమా తరువాత గోపీచంద్ ఓ డిఫరెంట్ జానర్ లో సినిమా చేయడం ఇదే. రెగ్యులర్ ఎంటర్ టైన్ మెంట్, మాస్ ఎలిమెంట్లతో కమర్షియల్ సినిమాలు చేస్తూ వస్తున్న గోపీచంద్ కెరీర్ కు ఈ సినిమా మంచి హెల్ప్ అయ్యే అవకాశం వుంది. ఇది గోపీచంద్ కు 33 వ సినిమా.






.jpg&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!