

అన్నాడీఎంకేకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు గురువారం పుదుచ్చేరి సమీపంలోని తవళకుప్పం ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ లగ్జరీ బీచ్ రిసార్ట్‌కు చేరుకోవడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. మాజీ మంత్రి సి.వి. షణ్ముగం ఆధ్వర్యంలో ఈ ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లినట్లు సమాచారం. తమిళనాడులో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇటీవలే సి.వి. షణ్ముగం, ప్రభుత్వం ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న విజయ్‌కు మద్దతు ఇవ్వాలని సూచించిన నేపథ్యంలో ఈ పరిణామానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు టీవీకే ప్రయత్నాలు కొనసాగుతున్న వేళ, అన్నాడీఎంకే ఎమ్మెల్యేల పుదుచ్చేరి ప్రయాణం రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకు దారితీస్తోంది. అయితే ఈ రిసార్ట్ సమావేశంపై అన్నాడీఎంకే అధిష్ఠానం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!