

గతేడాది బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన ‘ధురంధర్’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘ధురంధర్ 2: ది రివెంజ్’ ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ హైప్‌ను సృష్టిస్తోంది. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌కు ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 19 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ట్రైలర్, టీజర్లకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. దీంతో సినిమా రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాతో మరోసారి సంచలనం సృష్టించేందుకు దర్శకుడు ఆదిత్య ధర్ ప్రత్యేక ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ‘ధురంధర్ 2’ విజయవంతమైతే ఈ కథను మరింత విస్తరించి మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. యాక్షన్, భారీ విజువల్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలీవుడ్లో మరో పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!