
జనరల్

శ్రీశైలం రిజర్వాయర్ నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగించడంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని నిబంధనలకు అనుగుణంగానే కృష్ణా జలాలను వినియోగించాలని స్పష్టం చేసింది.
శ్రీశైలం నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగించడాన్ని వెంటనే నిలిపివేయాలని కేఆర్‌ఎంబీ ఆదేశించింది. తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. కృష్ణా జలాల కేటాయింపులు, వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో ఈ ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!