
జనరల్

రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి అక్కాచెల్లెలు, బాలిక, మహిళకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ అనేది ప్రేమ, ఆత్మీయత, అనుబంధం, ఐక్యతను చాటే పండుగ అని ఆయన పేర్కొన్నారు. ఈ పవిత్ర సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి సోదరి సుఖసంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, అన్ని రంగాల్లో అభివృద్ధి, శ్రేయస్సుతో జీవించాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి మహిళ, బాలికకు ఎల్లప్పుడూ దేవుడి ఆశీస్సులు, రక్షణ ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. వారి జీవితాల్లో ఆనందం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని కోరుకుంటూ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!