
ఓటీటీ

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. సెలవు దినం కావడం, వేసవి సెలవులు ముగుస్తుండటంతో 92 వేల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక దర్శనానికి సుమారు ఒక గంట, ధర్మదర్శనానికి దాదాపు మూడు గంటలు సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఆలయ క్యూ మార్గాలు, వేచివుండే ప్రదేశాలు రాత్రి వరకు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
వివిధ విభాగాల ద్వారా ఆలయానికి రూ.73,75,642 ఆదాయం సమకూరింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు, పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో బాసర జ్ఞాన సరస్వతీ ఆలయానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అక్షరాభ్యాసాల కోసం చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!