

‘ముఖ్యమంత్రి విజయ్’ అనే వాక్య భాగాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్ (X) ‘ముఖ్యమంత్రి స్టాలిన్’గా అనువదించడం చర్చనీయాంశంగా మారింది. గత శనివారం చెన్నైకి వచ్చిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీకి విజయ్ స్వాగతం పలికిన ఫొటోను ముఖ్యమంత్రి కార్యాలయం తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ పోస్టులో రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి విజయ్ భేటీ అయి మాట్లాడుకున్నట్లు పేర్కొన్నారు.
అయితే, ఆ పోస్టులోని ‘షో ట్రాన్స్‌లేషన్’ (Show Translation) ఎంపికను క్లిక్ చేసినప్పుడు ఆంగ్ల అనువాదంలో ముఖ్యమంత్రి విజయ్ పేరుకు బదులుగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ పేరు కనిపించింది. దీంతో ఎక్స్ అనువాదంలో చోటుచేసుకున్న ఈ పొరపాటు నెట్టింట వైరల్‌గా మారింది. రాజకీయ ప్రముఖుల పేర్లను అనువదించే క్రమంలో జరిగిన ఈ తప్పిదంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!