

ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఆన్లైన్ సమావేశాలు, వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పిలుపుతో మళ్లీ ఇంటి నుంచే పని విధానంపై చర్చ మొదలైంది. కొవిడ్ సమయంలో అమలైన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం మరోసారి అమల్లోకి రావచ్చనే ప్రచారం ఐటీ రంగంలో జోరందుకుంది.
ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కొంతకాలం పాటు తప్పనిసరిగా వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని కోరింది. ఉద్యోగుల రోజువారీ ప్రయాణాల వల్ల భారీగా ఇంధనం వృథా అవుతోందని, ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొంది. మరోవైపు నాస్కామ్ స్పందిస్తూ ఇప్పటికే ఐటీ కంపెనీలు హైబ్రిడ్ పని విధానాన్ని అమలు చేస్తున్నాయని తెలిపింది. ఉద్యోగుల అవసరాలు, క్లయింట్ డిమాండ్లను బట్టి కంపెనీలే నిర్ణయాలు తీసుకుంటున్నాయని, విద్యుత్ వినియోగం తగ్గించడం వంటి ఇంధన పొదుపు చర్యలను కూడా చేపడుతున్నాయని వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!