

విజయ రమణారావు, ప్రభుత్వ విప్, మంత్రి కొండా సురేఖ తన కుమార్తె వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కొండా సురేఖ, ఆమె కుమార్తె బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సరైన వివరణ ఇవ్వకపోతే పార్టీ అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకోవచ్చని హెచ్చరించారు.
ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎన్నో ఏళ్ల పాటు పోరాడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై పార్టీ నేతలే విమర్శలు చేయడం సరికాదని అన్నారు. పార్టీ, ప్రభుత్వానికి నష్టం కలిగించే వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఖండించారని తెలిపారు. కొండా సురేఖ విషయంలో క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా అండగా ఉంటారని స్పష్టం చేశారు.
రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు తగినవి కావని, వాటి వల్ల కాంగ్రెస్ కార్యకర్తల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని అన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఈ పరిణామాలు బాధాకరమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై గౌరవం లేకుండా మాట్లాడటాన్ని సహించబోమని స్పష్టం చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై పార్టీ చర్యలు తీసుకోవాలని, సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!