

మైనార్టీ శాఖలో అధికారిక మంత్రి కన్నా ఓ షాడో మినిస్టర్ ప్రభావమే ఎక్కువగా ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శాఖకు సంబంధించిన కీలక నిర్ణయాలు, అధికారుల బదిలీలు, పరిపాలనా అంశాల్లో ఆ నాయకుడి అనుమతి తప్పనిసరిగా మారిందనే టాక్ వినిపిస్తోంది. అధికారులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే వారికి ఫోన్ చేసి హెచ్చరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
మైనార్టీ శాఖ పరిధిలోని ఓ నామినేటెడ్ హోదాలో ఉన్న ఆ నాయకుడు జిల్లా స్థాయి నుంచి సచివాలయం వరకు ప్రభావం చూపుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల జరిగిన ఒక సమీక్ష సమావేశానికి శాఖ మంత్రి అజారుద్దీన్ హాజరుకాకపోవడం కూడా చర్చకు దారితీసింది. మున్సిపల్, హోంశాఖల్లో కూడా ఆయన ప్రభావం ఉందనే ప్రచారం జరుగుతుండగా, ఉన్నతస్థాయి మద్దతు కారణంగానే ఆయనను ఎవరూ ప్రశ్నించలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!