
సినిమాలు

జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అరకు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అన్ని స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. గిరిజనుల సంక్షేమం దృష్ట్యా పంచాయతీరాజ్ శాఖను స్వీకరించామని, గిరిజన హక్కుల పరిరక్షణకు పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు.
బాక్సైట్, హైడ్రోపవర్ ప్రాజెక్టులపై తనకు పూర్తి అవగాహన లేదని నాగబాబు పేర్కొన్నారు. ప్రకృతికి హాని కలిగించే ఎలాంటి నిర్ణయాన్నైనా పవన్ కళ్యాణ్ ఆమోదించరని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు, గిరిజన హక్కుల రక్షణకు పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!