
క్రీడలు

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆధునికీకరణ, పట్టణీకరణతో భవిష్యత్‌లో కొత్త సవాళ్లు ఎదురవుతాయని తెలిపారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ, సిగ్నల్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.
అండర్‌పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ అనే త్రీ-లెవెల్ విధానంతో పాటు మల్టీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. నగరంలో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర అభివృద్ధిని క్యూఆర్, ప్యూర్, రేర్ అనే మూడు విభాగాలుగా విభజించినట్లు తెలిపారు. అలాగే తెలంగాణ రైజింగ్-2047 మాస్టర్ ప్లాన్, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, ఈవీ బస్సులు, ఆటోలను ఈవీగా మార్చే ప్రణాళికలను కూడా వివరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!