

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కర్ణాటక రాష్ట్రాన్ని సందర్శించారు. ఉడుపి జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ ముకాంబిక ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళూరు నుంచి ఆలయానికి చేరుకున్న ఆయన సుమారు 30 నిమిషాల పాటు గర్భగుడిలో ప్రార్థనలు చేశారు. భక్తి సూచకంగా 1.6 కిలోల వెండి ఖడ్గాన్ని అమ్మవారికి సమర్పించి ఆలయ అర్చకుల నుంచి సంప్రదాయ సత్కారం అందుకున్నారు.
నివేదికల ప్రకారం దర్శనం పూర్తయ్యే వరకు విజయ్ ఉపవాసం పాటించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆయన రాకతో ఆలయం వెలుపల అభిమానులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న విజయ్, అనంతరం ముకాంబిక ఆలయాన్ని సందర్శించారు. ఆలయం వద్ద అభిమానులను అభివాదం చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!