
జనరల్

ఆస్ట్రేలియా జాతీయ విమానయాన సంస్థ క్వాంటాస్ ఎయిర్‌వేస్ తన ప్రయోగాత్మక ఎయిర్‌బస్ A350-1000ULR విమానంతో పౌర విమానయాన చరిత్రలో కొత్త రికార్డు సృష్టించింది. ఈ విమానం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నుంచి ఫ్రాన్స్‌లోని టౌలౌస్ వరకు ఎక్కడా ఆగకుండా 23,075 కిలోమీటర్లు ప్రయాణించి 24 గంటల 24 నిమిషాల నాన్‌స్టాప్ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో 2005లో నమోదైన బోయింగ్ 777 రికార్డు బద్దలైంది.
ఈ ప్రయోగం ప్రాజెక్ట్ సన్‌రైజ్‌లో భాగంగా నిర్వహించారు. 2027 నాటికి సిడ్నీ, మెల్‌బోర్న్ నగరాల నుంచి లండన్, న్యూయార్క్‌లకు నాన్‌స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభించాలనే లక్ష్యంతో ఈ పరీక్ష చేపట్టారు. విమానంలో మొత్తం 12 మంది మాత్రమే ఉండగా, ప్రత్యేకంగా రూపొందించిన ఫస్ట్‌క్లాస్ సూట్లు, అల్ట్రా లాంగ్ రేంజ్ సాంకేతికత ఈ విమానానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!