

నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ రేపు ఉదయం 11 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం గవర్నర్‌ను కలిసిన విజయ్, తనకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని చూపించారు. టీవీకే పార్టీ నేతలతో పాటు ‘జన నాయగణ్’ సినిమా నిర్మాత వెంకట్ కె నారాయణ కూడా ఉండటం ఆసక్తి కలిగించింది.
2020లో కేవీఎన్ ప్రొడక్షన్స్‌ను స్థాపించిన వెంకట్ కె నారాయణ ‘జన నాయగణ్’తో పాటు పలు భారీ చిత్రాలను నిర్మిస్తున్నారు. రాజకీయాలకు సంబంధం లేకపోయినా విజయ్‌తో కలిసి గవర్నర్‌ను కలవడం చర్చనీయాంశమైంది. ఇక ‘భగవంత్ కేసరి’ రీమేక్‌గా వస్తున్న ‘జన నాయగణ్’ సినిమా సెన్సార్ సమస్యలు, పైరసీ కారణంగా ఆలస్యం అవుతోంది. ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి అవుతున్న నేపథ్యంలో సినిమా విడుదలకు అడ్డంకులు తొలగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నెలలోనే విడుదల అవుతుందా లేదా జూన్‌లో వస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!