13, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సివిల్స్ అభ్యర్థులకు రాజీవ్ గాంధీ అభయహస్తం అండ

Writer: Pooja 06:10 AM, 13 నవంబర్, 2026
సివిల్స్ అభ్యర్థులకు రాజీవ్ గాంధీ అభయహస్తం అండ

తెలంగాణ నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు సివిల్స్‌లో విజయం సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) సహకారంతో ప్రారంభించిన ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం మరోసారి మంచి ఫలితాలను సాధించింది. ఈ పథకం ద్వారా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన తెలంగాణ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన రాష్ట్ర అభ్యర్థుల్లో 31 మంది తుది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. రెండు నెలల క్రితం ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి సింగరేణి దరఖాస్తులను ఆహ్వానించింది. వాటిని పరిశీలించి 158 మందిని అర్హులుగా గుర్తించి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మొత్తం రూ.1.58 కోట్ల ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించింది.

ప్రోత్సాహకం పొందిన 158 మందిలో 31 మంది తాజాగా తుది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. వీరికి అదనంగా ఒక్కొక్కరికి మరో రూ.లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం అందించనున్నారు. ఈ ఏడాది ఇంటర్వ్యూకు ఎంపికైన 31 మందిలో 18 మంది ఓబీసీ, ఎనిమిది మంది జనరల్, ముగ్గురు ఎస్సీ, ఇద్దరు ఎస్టీ అభ్యర్థులు ఉన్నారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులై తుది ఇంటర్వ్యూకు అర్హత సాధించిన తెలంగాణ అభ్యర్థులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. సివిల్స్ ఆశావహులకు ఆర్థికంగా అండగా నిలుస్తూ, రాష్ట్రం నుంచి మరింత మంది ఉన్నత స్థాయి ప్రభుత్వ సేవల్లోకి వచ్చేలా ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమరావతిలో తయారైన క్వాంటం కంప్యూటర్లు విదేశాలకు ఎగుమతి: సీఎం చంద్రబాబు

అమరావతిలో తయారైన క్వాంటం కంప్యూటర్లు విదేశాలకు ఎగుమతి: సీఎం చంద్రబాబు

రాప్తాడు కేసు నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థత

రాప్తాడు కేసు నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థత

బాలల ఉజ్వల భవిష్యత్తే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

బాలల ఉజ్వల భవిష్యత్తే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

రైల్వే ప్రయాణికులకు కీలక అప్‌డేట్

రైల్వే ప్రయాణికులకు కీలక అప్‌డేట్

సీఐఐ సమ్మిట్‌లో లోకేశ్‌, రానా మధ్య ఆసక్తికర సంభాషణ

సీఐఐ సమ్మిట్‌లో లోకేశ్‌, రానా మధ్య ఆసక్తికర సంభాషణ

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీ ప్రకటన.. ఐఐటీ ఢిల్లీ కీలక అప్‌డేట్

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీ ప్రకటన.. ఐఐటీ ఢిల్లీ కీలక అప్‌డేట్

ట్యాగ్లు
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తంతెలంగాణ ప్రభుత్వంసింగరేణియూపీఎస్సీ సివిల్స్సివిల్స్ ఇంటర్వ్యూభట్టి విక్రమార్క
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతిలో తయారైన క్వాంటం కంప్యూటర్లు విదేశాలకు ఎగుమతి: సీఎం చంద్రబాబు
జనరల్

అమరావతిలో తయారైన క్వాంటం కంప్యూటర్లు విదేశాలకు ఎగుమతి: సీఎం చంద్రబాబు

రాప్తాడు కేసు నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థత
జనరల్

రాప్తాడు కేసు నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థత

రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించాలి: మహేశ్ కుమార్ గౌడ్
రాజకీయాలు

రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించాలి: మహేశ్ కుమార్ గౌడ్

బాలల ఉజ్వల భవిష్యత్తే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

బాలల ఉజ్వల భవిష్యత్తే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

వికారాబాద్‌లో యువ మహిళా క్రికెటర్‌ నందిని మృతి
క్రీడలు

వికారాబాద్‌లో యువ మహిళా క్రికెటర్‌ నందిని మృతి

రైల్వే ప్రయాణికులకు కీలక అప్‌డేట్
జనరల్

రైల్వే ప్రయాణికులకు కీలక అప్‌డేట్

తండ్రిపై భూ ఆక్రమణ ఆరోపణలు.. ఖండించిన బీజేపీ ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్
రాజకీయాలు

తండ్రిపై భూ ఆక్రమణ ఆరోపణలు.. ఖండించిన బీజేపీ ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్

సీఐఐ సమ్మిట్‌లో లోకేశ్‌, రానా మధ్య ఆసక్తికర సంభాషణ
జనరల్

సీఐఐ సమ్మిట్‌లో లోకేశ్‌, రానా మధ్య ఆసక్తికర సంభాషణ

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీ ప్రకటన.. ఐఐటీ ఢిల్లీ కీలక అప్‌డేట్
జనరల్

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీ ప్రకటన.. ఐఐటీ ఢిల్లీ కీలక అప్‌డేట్

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై హైకోర్టును ఆశ్రయించిన చింతల రామచంద్రారెడ్డి
రాజకీయాలు

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై హైకోర్టును ఆశ్రయించిన చింతల రామచంద్రారెడ్డి

గవర్నర్‌కు నూతన ఏడీసీగా స్క్వాడ్రన్ లీడర్ హరీష్ చందర్
జనరల్

గవర్నర్‌కు నూతన ఏడీసీగా స్క్వాడ్రన్ లీడర్ హరీష్ చందర్

హరిత ఇంధన కేంద్రంగా ఏపీ.. భారీ పెట్టుబడులకు కీలక ఒప్పందాలు
జనరల్

హరిత ఇంధన కేంద్రంగా ఏపీ.. భారీ పెట్టుబడులకు కీలక ఒప్పందాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!