

మంత్రిత్వశాఖను నిర్వహించడం కష్టమా? ముగ్గురు పిల్లలను చూసుకోవడం కష్టమా? అంటూ ఉపాసన కొణిదెల ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌ను ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. దీనికి సమాధానంగా కుటుంబానికి సమయం కేటాయించడమే తనకు అన్నింటికంటే పెద్ద సవాలని లోకేశ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సదస్సు సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ప్రజా జీవితంలో బాధ్యతలు నిర్వహిస్తూనే కుటుంబానికి సమయం కేటాయించడం ఎంత ముఖ్యమో ఆయన సమాధానం ద్వారా వెల్లడైంది.
‘యంగ్ ఆంధ్ర.. థ్రైవింగ్ ఆంధ్ర – ఆరోగ్యం, ఆనందం, మానవ సామర్థ్యంపై కొత్త సంభాషణ’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్, యూఆర్ లైఫ్ వ్యవస్థాపకురాలు ఉపాసన కొణిదెల ఈ చర్చకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. విద్య, ఉపాధి, మహిళా సాధికారత, కుటుంబ విలువలు, సాంకేతికత, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం వంటి పలు అంశాలపై ఆమె ప్రశ్నలు సంధించగా, మంత్రి లోకేశ్ సమాధానాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, వ్యక్తిగత జీవితం-వృత్తిపరమైన బాధ్యతల మధ్య సమతుల్యత వంటి విషయాలు కూడా ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!