
జనరల్

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడంతో నందమూరి బాలకృష్ణ చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రవితేజకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పిన ఆయన, సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణ కృషి, విజన్‌ను ప్రశంసించారు. అలాగే సినిమాలో అద్భుతంగా నటించిన చిన్నారిని ప్రత్యేకంగా అభినందించారు.
‘ఇరుముడి’ లాంటి సినిమాలు దశాబ్దానికి ఒక్కసారి మాత్రమే వస్తాయని బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్‌లో తప్పక చూడాలని కోరారు. మరోసారి రవితేజ, శివ నిర్వాణతో పాటు మొత్తం చిత్ర బృందానికి ఘన విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. చివరగా “స్వామి శరణం” అంటూ తన సందేశాన్ని ముగించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!