

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు విష్ణువర్ధన్ కాంబినేషన్లో తెరకెక్కిన స్టైలిష్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ‘పంజా’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. అసలు విడుదల సమయంలో ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉన్న క్రేజ్ కారణంగా రీ రిలీజ్పై భారీ ఆసక్తి నెలకొంది. విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం ఉండగానే ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ జోరందుకున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ సేల్స్ ద్వారా రూ.1.5 కోట్లకు పైగా గ్రాస్ వసూలైనట్లు సమాచారం.
రీ రిలీజ్లో ‘పంజా’ భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. పవన్ కళ్యాణ్ పాత చిత్రాలను థియేటర్లలో మరోసారి చూసేందుకు అభిమానులు చూపిస్తున్న ఉత్సాహం సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉంది. అయితే గతంలో పవన్ సినిమాల రీ రిలీజ్లు సాధించిన వసూళ్లను ‘పంజా’ అధిగమిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. సారా జేన్ డయాస్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఆర్కా మీడియా, సంఘమిత్ర బ్యానర్లపై నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, నగేష్ ముంత నిర్మించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!