

ఇరుముడి సినిమా రెండో వీకెండ్‌ను పూర్తి చేసుకున్న తర్వాత కూడా థియేటర్లలో తన జోరును కొనసాగిస్తోంది. గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాక్సిక్ మాత్రం ప్రస్తుతం కాస్త సైలెంట్‌గా మారింది. ఈ వారం థియేటర్లలోకి పలు కొత్త సినిమాలు రానున్నాయి. అల్లరి నరేశ్ నటించిన రంభ ఊర్వశి మేనక, సందీప్ రెడ్డి వంగా నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న రోమాంచకం చిత్రాలపై కాస్త ఆసక్తి నెలకొంది. వీటితో పాటు దుల్కర్ సల్మాన్ ఐ యామ్ గేమ్, మమిత బైజు బెత్లెహోమ్ కుటుంబ యూనిట్, మీర్జాపూర్, మా రాముడు అందరివాడు, ధర్మస్థల నియోజకవర్గం, సహ వంటి సినిమాలు కూడా విడుదల కానున్నాయి.
మరోవైపు ఓటీటీ ప్రేక్షకులకు కూడా ఈ వారం వినోదానికి కొదవలేదు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 6 వరకు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో దాదాపు 18 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. సన్ నెక్స్ట్‌లో సెప్టెంబరు 4న డీసీ, అమెజాన్ ప్రైమ్‌లో జగమే సంగీతం, హాట్‌స్టార్‌లో ద కోర్ట్, సోనీ లివ్‌లో క్రైమ్ పాట్రోల్, ఉన్మాదం అందుబాటులోకి రానున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో గాంధారి, ధమాల్ 4, కొరియన్ కనకరాజు సహా పలు కొత్త కంటెంట్ రానుండగా, ఆపిల్ టీవీ ప్లస్‌లో మే డే సెప్టెంబరు 4న స్ట్రీమింగ్ కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!