

నటి అంజలికి పెళ్లి గురించి తరచూ ప్రశ్నలు ఎదురవుతుంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే అంశంపై మాట్లాడిన ఆమె.. ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. “అది నా పెళ్లి. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేసుకుంటా. పెళ్లి విషయంలో అంత తొందర ఎందుకు?” అంటూ తనదైన శైలిలో స్పందించారు. తన స్నేహితులకు పెళ్లి వేడుకలపై ఉన్న ఆసక్తిని కూడా అంజలి సరదాగా ప్రస్తావించారు. పెళ్లికూతురి కంటే తన స్నేహితులకే రెడీ అవ్వడం, ఫొటోషూట్లు చేయడం, సందడి చేయడం ఎక్కువగా ఇష్టమని చెప్పారు.
తన స్నేహితుల సరదా, సంతోషం కోసం తాను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని అంజలి నవ్వుతూ పేర్కొన్నారు. “మీరే పెళ్లి చేసుకోండి.. నేను వచ్చి రెడీ అయి మీ ఫొటోషూట్‌లో పాల్గొంటా” అని స్నేహితులతో చెబుతుంటానని వెల్లడించారు. పెళ్లి విషయంలో మాత్రం వారి మాట విననని స్పష్టం చేశారు. సినిమాల విషయానికొస్తే, అంజలి ఇటీవల విశాల్ నటించిన ‘మకుటం’లో కనిపించారు. రామ్ దర్శకత్వంలో సూరి, నివిన్ పౌలీ కీలక పాత్రల్లో నటించిన ‘ఏళు కడల్ ఏళు మలై’లోనూ ఆమె నటించారు. తెలుగులో ‘సంచారి’ పేరుతో విడుదల కానున్న ఈ చిత్రం అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!