

బెంగళూరులో ట్రాఫిక్ నిబంధనల పర్యవేక్షణ కోసం ఉపయోగిస్తున్న ఏఐ ఆధారిత కెమెరా చేసిన ఓ విచిత్రమైన పొరపాటు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హెల్మెట్ ధరించి ఒంటరిగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి వీపునకు తగిలించుకున్న గిటార్‌ను కెమెరా హెల్మెట్ లేని ప్యాసింజర్‌గా గుర్తించింది. దీంతో ఆటోమేటిక్‌గా రూ.500 జరిమానాతో చలాన్ జారీ చేసింది.
సౌవిక్ దత్తా అనే వ్యక్తి తన భార్యకు చెందిన టూ-వీలర్‌పై ఒంటరిగా ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆయన హెల్మెట్ ధరించి ఉండగా, వీపునకు గిటార్‌ను తగిలించుకున్నారు. అయితే ఏఐ కెమెరా దాన్ని మరో వ్యక్తిగా భావించి చలాన్ పంపింది. ఈ విషయాన్ని సౌవిక్ దత్తా ఎక్స్ వేదికగా బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు స్పందించి తప్పుగా జారీ అయిన ఫైన్‌ను రద్దు చేసుకోవాలని సూచించారు. ఈ ఘటన వైరల్ కావడంతో నెటిజన్లు సరదా కామెంట్లు, మీమ్స్‌తో స్పందించారు. ఆటోమేటెడ్ ట్రాఫిక్ వ్యవస్థలు జారీ చేసే చలాన్లలో అవసరమైన సందర్భాల్లో మానవ పరిశీలన కూడా ఉండాలనే చర్చకు ఈ ఘటన దారితీసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!