

బిగ్‌బాస్ తెలుగు 10 వీకెండ్ ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ కంటే ట్విస్ట్‌కు ఎక్కువ ప్రాధాన్యం దక్కింది. నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా సేవ్ అవుతూ చివరకు వర్షిణి, టెంపర్ వంశీ మాత్రమే మిగిలారు. దీంతో వీరిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లడం ఖాయమని భావించిన సమయంలో నాగార్జున కెప్టెన్ ముఖేష్‌కు ప్రత్యేక ఆఫర్ ఇచ్చారు. తన కెప్టెన్సీతో పాటు అధికారాలను వదులుకుంటే నామినేషన్స్ రద్దు చేసి వర్షిణి, వంశీ ఇద్దరినీ సేఫ్ చేస్తామని చెప్పారు. ముఖేష్ వెంటనే ఈ ఆఫర్‌ను అంగీకరించడంతో ఇద్దరూ ఎలిమినేషన్ నుంచి బయటపడ్డారు. అయితే ఈ నిర్ణయంతో ముఖేష్ తన కెప్టెన్సీని కోల్పోయాడు.
మరోవైపు ఈ వారం ప్రారంభంలోనే మిథిలేష్ రూ.15 లక్షలు తీసుకుని హౌస్ నుంచి బయటకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. తక్కువ రోజులు మాత్రమే హౌస్‌లో ఉన్నప్పటికీ భారీ మొత్తాన్ని తీసుకుని వెళ్లడంపై కొంతమంది కంటెస్టెంట్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. త్రిగుణ్ ఈ అంశంపై తీవ్రంగా స్పందించగా, అమన్‌తో కూడా వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదే సమయంలో రోహిత్‌కు నాగార్జున చెప్పిన శుభవార్త వీకెండ్ ఎపిసోడ్‌ను భావోద్వేగంగా మార్చింది. రోహిత్ సోదరికి బాబు పుట్టినట్లు నాగార్జున చెప్పడంతో అతను ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు కెప్టెన్సీ లేకుండా ముఖేష్ ఆట ఎలా మారుతుంది, తదుపరి కెప్టెన్ ఎవరు అవుతారు, కొత్త నామినేషన్స్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!