

అమెరికా పౌరసత్వం పొందాలని ఆశిస్తున్న వలసదారులకు కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ప్రభుత్వం పౌరసత్వ దరఖాస్తు ఫీజులను భారీగా పెంచే ప్రతిపాదనను విడుదల చేసింది. ఫెడరల్ రిజిస్టర్లో ప్రజాభిప్రాయ సేకరణ కోసం విడుదల చేసిన ఈ ముసాయిదా ప్రకారం, ప్రస్తుతం 760 డాలర్లుగా ఉన్న పౌరసత్వ దరఖాస్తు ఫీజును 1,330 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించారు. అలాగే అప్పీల్ అభ్యర్థనల ఫీజును 830 డాలర్ల నుంచి 1,475 డాలర్లకు పెంచే ఆలోచనలో ఉన్నారు.
అమెరికా అంతర్గత భద్రతా శాఖ (డీహెచ్ఎస్) ప్రకారం, దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు అయ్యే పూర్తి వ్యయాన్ని భర్తీ చేయడం, కఠిన భద్రతా తనిఖీల ఖర్చులను సమకూర్చడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. అయితే ఈ ప్రతిపాదనపై నిపుణులు, వలస హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన శాశ్వత నివాసితులకు అమెరికా పౌరసత్వం మరింత దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై 60 రోజుల పాటు ప్రజల అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!