

తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ ఇప్పటికే తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలో ప్రారంభంకానున్న పదో సీజన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్లపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. పలువురు సెలబ్రిటీల పేర్లు వైరల్ అవుతుండగా, తాజాగా రచయిత్రి మరియు గేయ రచయిత్రి కడలి సత్యనారాయణి పేరు కూడా జాబితాలో వినిపిస్తోంది.
సినీ, టెలివిజన్ ప్రేక్షకులకు ఆమె గురించి పెద్దగా పరిచయం లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఆధునిక లుక్‌తో పాటు తెలుగు భాషపై అపారమైన అభిమానం కలిగిన ఆమె పలు పుస్తకాలు రచించారు. ఒకవేళ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడితే, ఇప్పటికే ఉన్న ఫాలోయింగ్‌కు తోడు మరింత ప్రజాదరణ పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, ఆమె ఎంట్రీపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!