
జనరల్

స్విట్జర్లాండ్‌లో జరిగిన అమెరికా-ఇరాన్ చర్చలు సానుకూల వాతావరణంలో ముగిశాయని పాకిస్థాన్, ఖతార్ వెల్లడించాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు, ప్రాంతీయ భద్రతా అంశాలు, అంతర్జాతీయ సమస్యలపై విస్తృతంగా చర్చలు జరిగినట్లు సమాచారం.
ఇరాన్ అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ప్రత్యేక వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే లెబనాన్‌లో కొనసాగుతున్న సైనిక దాడులకు ముగింపు పలికే దిశగా ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయనున్నారు. పాకిస్థాన్, ఖతార్ మధ్యవర్తిత్వంతో చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు ఇరాన్ పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!