

నటి, మాజీ అందాల రాణి ఊర్వశి రౌతేలా మరోసారి వార్తల్లో నిలిచారు. మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు వరుసగా నాలుగోసారి జడ్జిగా వ్యవహరించి ప్రత్యేకతను చాటుకున్నారు. అయితే ఈసారి ఆమెకు ఈ కార్యక్రమం మరింత ప్రత్యేకంగా మారింది. తన కెరీర్‌లో కీలక పాత్ర పోషించిన, తన గురువుగా భావించే భారత తొలి మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో వేదిక పంచుకోవడంతో ఊర్వశి భావోద్వేగానికి గురయ్యారు.
సుస్మితా సేన్ తనకు తొలి మెంటర్ అని, తనకు ఎగరడానికి రెక్కలు ఇచ్చిన మహిళ అని ఊర్వశి పేర్కొన్నారు. తన పట్టాభిషేకం రోజున సుస్మిత స్వయంగా తనకు కిరీటం అలంకరించిన విషయాన్ని గుర్తు చేసుకున్న ఆమె.. అది తన జీవితంలో అత్యంత మధురమైన, మరచిపోలేని క్షణాల్లో ఒకటని అన్నారు. తనపై సుస్మిత ఉంచిన నమ్మకానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని, ఆ కృతజ్ఞతను మాటల్లో చెప్పలేనని ఊర్వశి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఊర్వశి ధరించిన త్రివర్ణ పతాక గౌను కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరుసగా నాలుగోసారి మిస్ యూనివర్స్ ఇండియా జడ్జిగా వ్యవహరించడం తనకు ఎంతో గౌరవంగా భావిస్తున్నానని ఆమె చెప్పారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తాను “నేను ఇండియన్” అని చెప్పిన మాటలకు ఈ త్రివర్ణ గౌను మరింత అర్థాన్ని ఇచ్చిందని పేర్కొంటూ, భారతీయురాలిగా పుట్టినందుకు గర్వపడుతున్నానని ఊర్వశి తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!