
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)పై ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ టీచర్లకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు కల్పించాలని నిర్ణయించింది. ఈ అంశంపై మంగళవారం తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు.
విద్యాహక్కు చట్టంలో అవసరమైన మార్పులు చేసి సీనియర్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కల్పించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీ కోరింది. ఈ నిర్ణయం అమలైతే 2010 ఆగస్టు 23కు ముందు నియమితులైన సుమారు 3.28 లక్షల మంది టీచర్లకు ప్రయోజనం కలగనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!