

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ విజయంతో రామ్‌చరణ్ ‘పెద్ది’పై మరోసారి చర్చ మొదలైంది. కమర్షియల్ సినిమాకు అవసరమైన మాస్ ఎలిమెంట్స్‌ను సరైన సమయంలో ఉపయోగిస్తే ఫలితం ఎలా ఉంటుందనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ‘పెద్ది’లో రామ్ చరణ్ నటన, సినిమాపై చేసిన ప్రయత్నం ఆకట్టుకున్నప్పటికీ సెకండాఫ్‌లో స్పోర్ట్స్, ఎమోషనల్ డ్రామా ఎక్కువగా ఉండటం, స్టార్ హీరోకు తగ్గ ఫైట్స్, ఎలివేషన్స్ తక్కువగా ఉండటం కొంతమంది ప్రేక్షకులను నిరాశపరిచిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఢిల్లీ ఎపిసోడ్ కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదనే చర్చ జరిగింది.
మరోవైపు ‘ఇరుముడి’లో ఎమోషన్‌తో పాటు కమర్షియల్ అంశాలను బ్యాలెన్స్ చేయడం సినిమాకు కలిసొచ్చిందని అభిమానులు అంటున్నారు. ‘ముత్యాల పల్లకి’ పాట తర్వాత వచ్చే ఆటో ఛేజ్, రవితేజ యాక్షన్ సన్నివేశాలు మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. కీలక ట్విస్ట్ తర్వాత కథను ఎక్కువగా సాగదీయకుండా యాక్షన్ మోడ్‌లోకి తీసుకెళ్లడం కూడా సినిమాకు ప్లస్‌గా మారిందనే టాక్ ఉంది. దీంతో దర్శకుడు బుచ్చిబాబు భవిష్యత్తులో మరింత పక్కా మాస్, కమర్షియల్ కథలపై దృష్టి పెడతారనే చర్చ మొదలైంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!