
జనరల్

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మకు సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు, చేనేత కళారత్న అవార్డు గ్రహీత విజయ్ కుమార్ అపురూపమైన కానుకను సమర్పించారు. అగ్గిపెట్టెలో పట్టేంత చిన్న పరిమాణంలో ప్రత్యేకంగా రూపొందించిన పట్టుచీరను అమ్మవారికి సమర్పించి తన భక్తిని చాటుకున్నారు. ఈ విశిష్ట కానుక భక్తులను, చేనేత ప్రేమికులను ఆకట్టుకుంటోంది.
కేవలం 200 గ్రాముల బరువుతో రూపొందించిన ఈ పట్టుచీరను విజయ్ కుమార్ వారం రోజుల పాటు శ్రమించి తయారు చేశారు. ఆయన ప్రతిభను దుర్గగుడి ఈవో శీనానాయక్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం విజయ్ కుమార్ అమ్మవారిని దర్శించుకుని వేదపండితుల ఆశీర్వాదం పొందారు. చేనేత కళ వైభవాన్ని ప్రతిబింబించే ఈ కానుక ప్రస్తుతం విశేష చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!