
షోస్

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో చేపట్టిన జాతీయ రహదారుల పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. బుధవారం ఢిల్లీలోని తన కార్యాలయంలో తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, లడఖ్ రాష్ట్రాల్లో జరుగుతున్న రహదారి ప్రాజెక్టుల పురోగతిని ఆయన సమీక్షించారు. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
నాణ్యతా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని గడ్కరీ సూచించారు. జాతీయ రహదారులపై మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని, వర్షాకాలంలో రోడ్లపై నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమస్యల పరిష్కారానికి తక్షణ స్పందన బృందాలను వినియోగించాలని కూడా సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!