

నితిన్ గడ్కరీ తెలంగాణ రవాణా శాఖ చేపడుతున్న సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించారు. రవాణా చెక్‌పోస్టుల రద్దు, వాహన్–సారథి వేదికల సమర్థవంతమైన అనుసంధానం, ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్‌ల ఏర్పాటు, సాంకేతికత ఆధారిత రోడ్డు భద్రతా తనిఖీల ద్వారా అమలును బలోపేతం చేస్తున్న తీరు అభినందనీయమని కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి పేర్కొన్నారు.
డిజిటల్ పాలన, నిరాటంక రవాణా నిర్వహణ, మెరుగైన రహదారి భద్రత లక్ష్యాలకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు పూర్తిగా అనుగుణంగా ఉన్నాయని నితిన్ గడ్కరీ తెలిపారు. సుస్థిర రవాణాను ప్రోత్సహించడంలో, ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలకుగాను రవాణా శాఖను ప్రత్యేకంగా అభినందించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!