
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టును ప్రకటించింది. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (CPWD) ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో రూ.2,534 కోట్ల వ్యయంతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కార్యకలాపాలు మరింత బలోపేతం కానున్నాయి.
మొత్తం నిధుల్లో రూ.1,299.08 కోట్లు కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి, రూ.1,234.91 కోట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణానికి వినియోగించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం సీఆర్డీఏ ఇప్పటికే 22.53 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో 5.53 ఎకరాల్లో సెక్రటేరియట్, 17 ఎకరాల్లో నివాస సముదాయాలు నిర్మించనున్నారు. దీంతో అమరావతి పరిపాలనా కేంద్రంగా మరింత అభివృద్ధి చెందనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!