
జనరల్

ముంబయిలో శివసేన (యూబీటీ)లో కొందరు ఎంపీలు తిరుగుబాటు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తల మధ్య పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడి వెళ్లిన ఎంపీలకు గత ఎన్నికల్లో ఓటు వేసిన ప్రజలకు తన తరఫున క్షమాపణలు తెలిపారు. తన నాయకత్వంపై ఎవరికైనా విశ్వాసం లేకపోతే పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
అలాగే కాంగ్రెస్‌తో రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, బీజేపీ చేస్తున్నట్లుగా తమ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం కాంగ్రెస్ ఎప్పుడూ చేయలేదని ఉద్ధవ్ పేర్కొన్నారు. బీజేపీతో మూడు దశాబ్దాల పొత్తు కొనసాగించినప్పటికీ తాము ఆ పార్టీలో విలీనం కాలేదని, అలాంటప్పుడు కాంగ్రెస్‌లో ఎందుకు విలీనం అవుతామని ప్రశ్నించారు. ప్రస్తుతం శివసేన (యూబీటీ)లో నెలకొన్న పరిణామాలు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!