

తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మార్గదర్శకంగా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ‘వేంకటాద్రి’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాపిల్ ఫోన్లలో ఉపయోగించే వారికి కూడా త్వరలో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, జీపీఎస్ ఆధారిత నావిగేషన్ సదుపాయాలతో తిరుమలలో మ్యాప్ చేసిన 100కు పైగా ప్రదేశాలకు చేరుకునేందుకు ఇది సహాయపడుతుంది. గమ్యస్థానాలను గుర్తించేందుకు వర్చువల్ మ్యాన్ ఫీచర్‌ను కూడా ఇందులో అందించారు.
ఇంటర్నెట్ సదుపాయం సరిగా లేని ప్రాంతాల్లోనూ యాప్ పనిచేయడం భక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. తిరుమలలోని వివిధ ప్రదేశాలను గుర్తించడంతో పాటు, శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రోజువారీగా జరిగే వాహన సేవల వివరాలను కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో భక్తులు తమ ప్రయాణాన్ని సులభంగా ప్రణాళిక చేసుకోవడంతో పాటు, ఉత్సవాల కార్యక్రమాలపై సమాచారాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ డిజిటల్ సేవ తిరుమలకు వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా రూపొందించబడింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!