
సినిమాలు

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్లు అందించనున్నారనే వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. అలాంటి కథనాలన్నీ పూర్తిగా “ఫేక్ న్యూస్” అని పేర్కొంటూ, డెమోక్రాట్లు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
తన సోషల్ మీడియా పోస్టులో ట్రంప్ మాట్లాడుతూ, ఇరాన్‌కు ఎలాంటి భారీ ఆర్థిక ప్యాకేజీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ప్రాంతీయ శాంతి, భద్రత లక్ష్యంగానే కుదిరిందని పేర్కొన్నారు. అలాగే ఇరాన్ అణ్వాయుధాల లక్ష్యాన్ని శాశ్వతంగా వదులుకుందని కూడా ఆయన వెల్లడించారు. ఒప్పందంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ట్రంప్ విమర్శించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!