

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తన విదేశీ విద్యపై వస్తున్న విమర్శలకు స్పందించారు. అమెరికాలో బోస్టన్ విశ్వవిద్యాలయంలో స్కాలర్‌షిప్‌తో చదువుకున్నానని, అదనంగా విద్యా రుణం తీసుకున్నానని తెలిపారు. ఆ రుణాన్ని ఇంకా చెల్లిస్తున్నానని చెప్పారు. తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు బంగ్లాదేశ్, నేపాల్ ఆందోళనలతో తమ ఉద్యమాన్ని పోల్చడం సరికాదని అన్నారు. భారత్‌లోనే మహాత్మా గాంధీ వంటి స్ఫూర్తిదాయక నాయకుల వారసత్వం ఉందని పేర్కొన్నారు.
జంతర్ మంతర్‌లో నిర్వహించిన విద్యార్థుల ఆందోళన శాంతియుతంగా జరిగిందని, ఎలాంటి హింసకు తావులేదని అభిజీత్ దీప్కే తెలిపారు. విద్యను ఎన్నికల ప్రధాన అంశంగా మార్చాలని, విద్యపై పెట్టుబడి దేశ భవిష్యత్తుకు కీలకమని అన్నారు. నీట్ అక్రమాల కారణంగా నష్టపోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొత్త పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన లేదని, ప్రజలు ప్రభుత్వాలను ప్రశ్నించే స్థాయికి రావడమే ఉద్యమ విజయమని చెప్పారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!