2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రైతుబంధు నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం: కేటీఆర్‌

Writer: Shivani K 06:16 AM, 2 నవంబర్, 2026
రైతుబంధు నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం: కేటీఆర్‌

రైతులు పండించిన పత్తిని సీసీఐ ద్వారా కొనుగోలు చేయించడంలో ప్రధాని నరేంద్ర మోదీ, వరి ధాన్యం, సోయా పంటలను ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేయించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. ఆదిలాబాద్‌ డైట్‌ మైదానంలో ఆదివారం రాత్రి మాజీ మంత్రి జోగు రామన్న అధ్యక్షతన నిర్వహించిన రైతు గర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని మోదీ, రైతులకు రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. భారాస పదేళ్ల పాలనలో తెలంగాణ అన్నపూర్ణగా మారిందని, రైతుబంధు, రైతు బీమా పథకాలు సమర్థంగా అమలయ్యాయని పేర్కొన్నారు. కేసీఆర్‌ హయాంలో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్ల రైతుబంధు నిధులు జమ చేశారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎల్‌నినో పేరుతో బాధ్యతల నుంచి తప్పించుకుంటోందని కేటీఆర్‌ మండిపడ్డారు.

రైతులకు సాగునీరు, విద్యుత్తు అందించడంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్‌ ఆరోపించారు. గోదావరి నీరు సముద్రంలో కలుస్తున్నా పాలమూరు ప్రాంతానికి నీటిని అందించలేకపోతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని వినియోగించుకోవాలని సూచించిన విశ్రాంత ఇంజినీర్లపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. ఏడాది ఓపిక పడితే మళ్లీ భారాస ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, రైతుబంధు నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహించి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ప్రకటించారు. అంతకుముందు నేరడిగొండ, తలమడుగు మండలాల్లో పర్యటించిన కేటీఆర్‌.. ఆత్మహత్య చేసుకున్న నలుగురు రైతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, రిమ్స్‌ ఆసుపత్రిలో ఏసీ ప్రమాదంలో మరణించిన ఐదుగురు చిన్నారుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఎన్‌ఎస్‌యూఐ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు భార్గవ్‌ దేశ్‌పాండేను భారాసలోకి ఆహ్వానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకున్నారు.. కూటమి ప్రభుత్వంపై జగన్‌ ఫైర్‌

పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకున్నారు.. కూటమి ప్రభుత్వంపై జగన్‌ ఫైర్‌

కూటమి నేతలు, పోలీసులను రెచ్చగొట్టేలా జగన్‌ వ్యవహారం- చంద్రబాబు

కూటమి నేతలు, పోలీసులను రెచ్చగొట్టేలా జగన్‌ వ్యవహారం- చంద్రబాబు

కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు

కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు

బెల్ట్‌షాపుల నిర్మూలనలో కాంగ్రెస్‌ విఫలమైంది.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విమర్శలు!

బెల్ట్‌షాపుల నిర్మూలనలో కాంగ్రెస్‌ విఫలమైంది.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విమర్శలు!

రాహుల్‌ గాంధీ అనవసర సమస్యలు లేవనెత్తుతున్నారు.. ప్రధాని మోదీ ఎక్కడికీ వెళ్లరు: బీజేపీ

రాహుల్‌ గాంధీ అనవసర సమస్యలు లేవనెత్తుతున్నారు.. ప్రధాని మోదీ ఎక్కడికీ వెళ్లరు: బీజేపీ

పిఠాపురంలో పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత..

పిఠాపురంలో పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత..

ట్యాగ్లు
కేటీఆర్భారాసరైతు గర్జన సభఆదిలాబాద్రైతు సమస్యలురైతుబంధురేవంత్‌రెడ్డినరేంద్ర మోదీపత్తి కొనుగోళ్లుతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కులశేఖరన్‌పట్టినం నుంచి తొలి రాకెట్‌ ప్రయోగం.. ఇస్రో కీలక ప్రకటన
జనరల్

కులశేఖరన్‌పట్టినం నుంచి తొలి రాకెట్‌ ప్రయోగం.. ఇస్రో కీలక ప్రకటన

బెంగళూరు–ముంబయి మధ్య వందేభారత్‌ స్లీపర్‌ రైలు ప్రారంభం
జనరల్

బెంగళూరు–ముంబయి మధ్య వందేభారత్‌ స్లీపర్‌ రైలు ప్రారంభం

రైతుబంధు నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం: కేటీఆర్‌
రాజకీయాలు

రైతుబంధు నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం: కేటీఆర్‌

పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకున్నారు.. కూటమి ప్రభుత్వంపై జగన్‌ ఫైర్‌
రాజకీయాలు

పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకున్నారు.. కూటమి ప్రభుత్వంపై జగన్‌ ఫైర్‌

కూటమి నేతలు, పోలీసులను రెచ్చగొట్టేలా జగన్‌ వ్యవహారం- చంద్రబాబు
రాజకీయాలు

కూటమి నేతలు, పోలీసులను రెచ్చగొట్టేలా జగన్‌ వ్యవహారం- చంద్రబాబు

రియల్‌ ఎస్టేట్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
జనరల్

రియల్‌ ఎస్టేట్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు

ఇరాన్‌ కీలక నేతలే ఇజ్రాయెల్‌ టార్గెట్‌.. పేజర్‌ తరహా రహస్య ఆపరేషన్‌?
జనరల్

ఇరాన్‌ కీలక నేతలే ఇజ్రాయెల్‌ టార్గెట్‌.. పేజర్‌ తరహా రహస్య ఆపరేషన్‌?

బెల్ట్‌షాపుల నిర్మూలనలో కాంగ్రెస్‌ విఫలమైంది.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విమర్శలు!
రాజకీయాలు

బెల్ట్‌షాపుల నిర్మూలనలో కాంగ్రెస్‌ విఫలమైంది.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విమర్శలు!

రజనీ–కమల్‌ మల్టీస్టారర్‌పై క్రేజీ అప్‌డేట్‌
సినిమాలు

రజనీ–కమల్‌ మల్టీస్టారర్‌పై క్రేజీ అప్‌డేట్‌

శివుని ఐదు ముఖాలను ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?
జనరల్

శివుని ఐదు ముఖాలను ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

తుంగభద్ర నది తీరంలో అద్భుత శివక్షేత్రం.. పంచలింగాల ఆలయ విశేషాలు ఇవే!
జనరల్

తుంగభద్ర నది తీరంలో అద్భుత శివక్షేత్రం.. పంచలింగాల ఆలయ విశేషాలు ఇవే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!