

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ మరియు ఆయన భార్య బ్రిజిట్టే మెక్రాన్‌కు సంబంధించిన వ్యక్తిగత ఘటనలపై కొత్తగా వెలువడిన పుస్తకం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. జర్నలిస్టు ఫ్లోరియన్ టార్డిఫ్ రచించిన ‘యాన్ (ఆల్‌మోస్టు) పర్‌ఫెక్ట్ కపుల్’ పుస్తకంలో, గతేడాది విదేశీ పర్యటన సందర్భంగా బ్రిజిట్టే తన భర్త చెంపపై కొట్టినట్టు పేర్కొన్నారు. ఇరాన్ నటి గోల్షిఫ్తే ఫర్హానీతో మెక్రాన్ చాటింగ్ చేస్తున్నట్లు ఫోన్‌లో చూసిన తర్వాత ఆమె ఆగ్రహానికి గురైనట్టు రచయిత వివరించారు. ఈ పుస్తకంలోని కొన్ని భాగాలను ఫ్రాన్స్ మీడియా కూడా ప్రచురించింది.
వియత్నాం పర్యటన సందర్భంగా గతంలో వైరల్ అయిన వీడియోను కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు. హనోయ్‌లో విమానం దిగే ముందు బ్రిజిట్టే తన భర్తను వెనక్కు నెట్టినట్లు కనిపించిన వీడియో అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే ఆ ఘటనను మెక్రాన్ చిన్న విషయంగా కొట్టిపారేశారు. మరోవైపు ఈ ఆరోపణలను బ్రిజిట్టే ప్రతినిధులు, ఇరాన్ నటి గోల్షిఫ్తే ఫర్హానీ ఖండించారు. తాము ఇలాంటి విషయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై అప్పట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించడం గమనార్హం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!