
టెక్నాలజీ

నేపాల్లోని మకవాన్పూర్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాఠ్మాండూ నుంచి సర్లాహి వెళ్తున్న ప్రయాణికుల వాహనం మార్గమధ్యంలో అదుపుతప్పి సుమారు 500 మీటర్ల లోతున్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హెటౌడ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, గాయపడిన వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!