
జనరల్

కర్ణాటకలోని బెంగళూరు దక్షిణ తాలూకా మడ పట్టణంలోని కావేరి స్టోన్ క్రషర్ కంపెనీలో ఈరోజు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ బండరాయి కార్మికులపై కూలిపోవడంతో ఏడుగురు కార్మికులు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు బిహార్‌కు చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు.
ప్రమాదం జరిగిన సమయంలో క్వారీలో 15 నుంచి 20 మంది కార్మికులు పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. కొత్త క్రషర్ యూనిట్ ఏర్పాటులో భాగంగా దాదాపు 100 అడుగుల ఎత్తులో హిటాచీ యంత్రం పనిచేస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!